నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం | - | Sakshi
Sakshi News home page

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

Nov 2 2026 1:17 AM | Updated on Nov 2 2026 1:17 AM

రేపు ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్‌ ఎంపికలు

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ నగరంలోని వినాయక్‌నగర్‌–1 ఫీడర్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్‌–3 ఏడీఈ వినోద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫులాంగ్‌ 33/11 కేవీ రైతుబజార్‌ ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ లైన్‌ కోసం టవర్స్‌ బిగించే క్రమంలో 33/11 కేవీ వినాయక్‌నగర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో ఉ న్న 11 కేవీ ఫులాంగ్‌, హనుమాన్‌నగర్‌, తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు విద్యుత్‌శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

కబడ్డీ శిక్షణకు

దరఖాస్తుల ఆహ్వానం

వేల్పూర్‌(ముప్కాల్‌): ముప్కాల్‌ మండల కేంద్రంలోని భూదేవి ఇండోర్‌ స్డేడియంలో నిర్వహించే బాలుర కబడ్డీ (అండర్‌ 16 సబ్‌జూనియర్‌) శిక్షణకు ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు లింగయ్య, గంగాధర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2010 డిసెంబర్‌ 13 తర్వాత జన్మించిన వారు అర్హులని, ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్‌కార్డు, ఎస్సెస్సీ మెమోతో గురువారం ఉదయం 10 గంటలలోపు రిపోర్టు చేయాలన్నారు. 22 మంది క్రీడాకారులతో ప్రాబబుల్స్‌ తీసుకొని, శిక్షణ ఇస్తారని, 14 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తారన్నారు. ఈనెల 12 నుంచి 14 వరకు వికారాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడల్లో వీరు పాల్గొంటారని వెల్లడించారు.

ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ఇటీవల జరిగిన ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ అండర్‌–14 బాల బాలికల టోర్నమెంట్‌ కం సెలెక్షన్‌ పోటీలు జరిగాయి. వీటిలో నిజామాబాద్‌ జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీ అలివేణి మంగ చే తుల మీదుగా జట్టు క్రీడాకారిణులు మెడల్స్‌ అందుకున్నారు. జట్టులో చక్కని ప్రతిభ చూపిన క్రీడాకారిణులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు మంగ తెలిపారు.

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా (నిజామాబాద్‌, కామారెడ్డి) ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 బాలుర, బాలికల బాస్కెట్‌బాల్‌ ఎంపిక పోటీలు ఈ నెల 3న (మంగళవారం) జిల్లా కేంద్రంలోని ఉమెన్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 01జనవరి 2008 తర్వాత పుట్టిన వారు మాత్రమే ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనడానికి అర్హులని ఆయన తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు క్రీడాకారులందరూ తాము చదివే కళాశాలకు సంబంధించిన ధ్రువపత్రాల (బోనాఫైడ్‌, ఆధార్‌) తో రిపోర్టు చేయాలని తెలిపారు. నిజామాబాద్‌, కామారెడ్డి నోడల్‌ ఆఫీసర్లు రవికుమార్‌, షేక్‌ సలామ్‌ ల ఆధ్వర్యంలో సెలెక్షన్స్‌ జరుగుతాయని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం 94400 07004ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement