పేలిన నాటు బాంబులు | - | Sakshi
Sakshi News home page

పేలిన నాటు బాంబులు

Nov 2 2026 1:17 AM | Updated on Nov 2 2026 1:17 AM

● ముగ్గురి పరిస్థితి విషమం..

నలుగురికి తీవ్రగాయాలు

● తాడ్కోల్‌ జీపీ పరిధిలోని ఎర్రమన్నుకుచ్చ కాలనీలో ఘటన

బాన్సువాడ: అడవిపందులను వేటాడేందుకు తయారు చేసిన నాటు బాంబులు మనుషుల ప్రా ణాల మీదికి తెచ్చాయి. నాటు బాంబులు పేలి ఏడుగురికి తీవ్రగాయాలైన ఘటన బాన్సువాడ మండలం తాడ్కో ల్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రమన్నుకుచ్చ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. కాలనీలో నివాసముంటున్న దండ్ల వెంకయ్య అడవి పందుల వేట కోసం నాటు బాంబులు త యారు చేస్తాడు. ఆదివారం వేటకు వెళ్లేందుకు వెంకయ్య కుమారుడు రాజు, పక్కింట్లో నివాసముంటున్న దాసరి లక్ష్మయ్య, రాజారాం దుబ్బా కాలనీకి చెంది న చిత్తరి లక్ష్మణ్‌, కడమంచి రమేశ్‌ సిద్ధమయ్యారు. రాజుకు చెందిన ఎక్స్‌ఎల్‌ వాహనంలో సుమారు 40–50 వరకు నాటుబాంబులను పెట్టుకున్నారు. రాత్రివేళలో అడవిలో నిద్రించేందుకు దుప్పట్లు, వాటర్‌ బాటిళ్లు సిద్ధం చేసుకున్నారు. అక్కడే ఉన్న చిత్తరి లక్ష్మణ్‌ ఎక్స్‌ఎల్‌లో ఉన్న ఒక నాటుబాంబును తీసుకొని పేలుతుందా లేదా అని పరీక్షించేందుకు నేలకేసి కొట్టాడు. దీంతో నాటుబాంబు పేలి దాని మెరుగులు ఎక్స్‌ఎల్‌ వాహనంలో ఉన్న మిగిలిన బాంబులపై పడటంతో ఒక్కసారిగా అన్ని పేలాయి. అక్కడే దండ్ల వెంకయ్య ఇంటి ఎదుట ఆడుకుంటున్న రాజు కూతుళ్లు శ్రీదేవి, అంజలితోపాటు అటుగా సైకిల్‌పై వెళ్తున్న మరో చిన్నారి వైశాలికి గాయాలయ్యాయి. వాహనం వద్ద ఉన్న రాజు, దాసరి లక్ష్మణ్‌, రమేశ్‌, చిత్తరి లక్ష్మణ్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వెంకయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకయ్య నాటు బాంబులు తయారు చేస్తున్నట్లు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఘటనా స్థలానికి వచ్చిన డీఎస్పీ విఠల్‌రెడ్డికి స్థానికులు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement