అధికారుల్లో వణుకు! | - | Sakshi
Sakshi News home page

అధికారుల్లో వణుకు!

Nov 2 2026 1:17 AM | Updated on Nov 2 2026 1:17 AM

● డీసీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డిపై వేటుతో..

● అదేబాటులో మరికొందరంటూ ప్రచారం

● సీఐడీ, విజిలెన్స్‌ నివేదికలో ఉద్యోగులు, రైస్‌మిల్లర్ల పేర్లు

సుభాష్‌నగర్‌: సీఐడీ పోలీసుల విచారణతో జిల్లా లోని పౌరసరఫరాలశాఖ, సంస్థ ఉద్యోగులతోపా టు రైస్‌మిల్లర్లలో వణుకు మొదలైంది. డీసీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డిపై వేటు పడగా, మరికొందరు అధికారులు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై చర్యలు తప్పవనే ప్రచారం మొదలైంది. సీఐడీ అధికారులు త్వరలోనే అధికారులతోపాటు ఉద్యోగులు, సిబ్బంది, రైస్‌మిల్లర్లను విచారించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే నలుగురు రైస్‌మిల్లర్లు అరెస్ట్‌ కాగా, తాజాగా శ్రీకాంత్‌రెడ్డితోపాటు మరో ఇద్దరిని రెండు వారాల రిమాండ్‌కు తరలించారు. సీఐడీ, విజిలెన్స్‌ అధికారుల నివేదికలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వ చ్చినట్లు సమాచారం. సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకున్న కేసులో సు మారు 70 మందికిపైగా రైస్‌మిల్లర్ల హస్తం ఉన్నట్లు తెలిసింది. సీఐడీ రంగంలోకి దిగడంతో 35 మందికిపైగా ముందస్తు బెయిల్‌ తెచ్చుకోగా, మరికొందరు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ అరెస్టులకు సిద్ధం కావడంతో రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ కీలక నేత సహా ఇంకొందరు పరారీలో ఉన్నారు. జిల్లాలోని పౌరసరఫరాలశాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన సదరు అధికారి డీసీఎస్‌ఓగా ఇదే జిల్లాకు రావడం.. కార్యాలయంలో, మిల్లర్ల విషయంలో ఏకఛక్రాధితప్యం చలాయించడం పలు విమర్శలకు దారితీసింది. తనకు నచ్చిన వారికే గోదాముల కేటాయించడంతో కొందరు మిల్లర్లకు మింగుడు పడలేదు. రా, బాయిల్డ్‌ కలిసి సుమారు 100 మంది రైస్‌మిల్లర్లకు ఇష్టారీతిన అండగా నిలవడం (సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యం పాస్‌ చేయించుకోవడం వంటివి) మిగతా వారికి నచ్చలేదు. తాజాగా సీఐడీ, విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆయనపై చర్యలు తీసుకోవడంతో కొందరు రైస్‌మిల్లర్లు సంబరపడుతున్నారు.

14 రోజుల రిమాండ్‌..

సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యం పాస్‌ చేశారనే ఆరోపణల నేపథ్యంలో శ్రీకాంత్‌రెడ్డిని శనివారం రాత్రి కస్టడీలోకి తీసుకున్న సీఐడీ పోలీసులు.. ఆదివారం ఉదయం మెజిస్ట్రేట్‌ వడ్డి హరికుమార్‌ ఎదుట హాజరుపర్చారు. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. శ్రీకాంత్‌రెడ్డితోపాటు బోధన్‌కు చెందిన రైస్‌మిల్‌ వ్యాపారి కిషోర్‌ ఇనాని, ఆయన కుమారుడిని కూడా సీఐడీ పోలీసులు మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చారు. వారికి కూడా రెండు వారాల పాటు రిమాండ్‌ విధించారు.

పదేళ్లలో రూ.500 కోట్లకు పైగా..

జిల్లాలో పదేళ్లలో సుమారు రూ.500 కోట్లకుపైగా సీఎంఆర్‌ బకాయిలు పేరుకుపోయాయి. రికవరీ విషయంలో పౌరసరఫరాలశాఖ అధికారి ఉదాసీనంగా వ్యవహరించడం, రూ.కోట్లలో చేతులు మారడం, కొందరు మిల్లర్లతో చెట్టాపట్టాల్‌ వేసు కుని తిరగడంతో సంబంధిత అధికారిపై వేటు పడిన విషయం తెలిసిందే. సీఐడీ, విజిలెన్స్‌ తనిఖీలకు వచ్చిన సమయంలో సదరు అధికారి వరు స సెలవులు పెట్టడం, రికార్డుల తారుమారుకు ప్రయత్నం, దొడ్డు బియ్యం అంటగట్టిన మిల్లర్లతో టచ్‌లో ఉండటం వంటివి నివేదికల్లో పొందుపర్చిన అంశాలకు బలం చేకూర్చింది. జిల్లాకు వచ్చిన రెండేళ్లలోనే రూ.కోట్లలో సంపాదించారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement