నిజామాబాద్‌అర్బన్: ఆదికవి, మహర్షి వాల్మీకి జ యంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన వాల్మీకి జ యంతి వేడుకలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతి థిగా హాజరయ్యారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. సమాజంలో సత్ప్రవర్తన, సమానత్వం, సో దరభావం పెంపొందించేందుకు వాల్మీకి బోధనలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, జిల్లా వెను కబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాయి కుమార్, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు నరేశ్, బీ సీ సంఘాల నాయకులు బుస్స ఆంజనేయులు, రా జేశ్వర్, బస్సాపూర్ శంకర్ పాల్గొన్నారు.


