అధికారులు సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు సమయపాలన పాటించాలి

Oct 27 2026 12:50 AM | Updated on Oct 27 2026 12:50 AM

● ప్రజావాణి ఫిర్యాదులను

త్వరితగతిన పరిష్కరించాలి

● కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నిజామాబాద్‌అర్బన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 121 ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కలెక్టర్లు రాజాగౌడ్‌, భుజంగరావు, డీఆర్వో గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, డీఆర్డీవో సాయన్న, మున్సిపల్‌ అదనపు కమిషనర్‌ చంద్రశేఖర్‌తో కలిసి కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని, పెండింగ్‌ అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ఎల్‌నినోపై అవగాహన కల్పించాలి

ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడం, కొంతమంది ఆలస్యంగా హాజరుకావడాన్ని గమనించిన కలెక్టర్‌, ప్రతి ఒక్కరూ విధిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రజావాణి ప్రారంభమయ్యే నిర్ణీత సమయం ఉదయం 10.30 గంటల వరకు అధికారులు అందరూ హాజరు కావాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్లవద్దని ఆదేశించారు. ఎల్‌నినోపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు అవగాహన సదస్సులలో పాల్గొనాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement