● పరారీలో మరో ముగ్గురు
● వాహనం, నగదు స్వాధీనం
● ఎస్పీ రాజేశ్‌చంద్ర వెల్లడి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: గ్యాస్ కట్టర్‌లతో ఏటీఎంలను ధ్వంసం చేసి డబ్బులు లూటీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపారు. గాంధారి ఏటీఎం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన రషీద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 10 అర్ధరాత్రి దాటిన తర్వాత గాంధారిలోని ప్రధాన రహదా రిపై ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్లతో ధ్వంసం చేసిన దొంగలు.. రూ. 25.45 లక్షల నగదు దో చుకెళ్లిన విషయం తెలిసిందే. మహిళల నైటీలు ధరించిన దొంగలు తలను, ముఖాన్ని కప్పేసుకుని, చేతులకు గ్లౌజులు తొడుక్కుని వచ్చి 12 నిమిషాల్లో ఏటీఎంను ధ్వంసం చేసి నగదుతో తాము తెచ్చుకున్న వా హనంలో పరారయ్యారు. ఈ ముఠాను పట్టుకునేందుకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్‌కుమార్, పిట్లం ఎస్సై ఆంజనేయలు, సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్, ఇత ర అధికారులతో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీ, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వాహనం గుర్తింపు సమాచారంతో ఇతర రాష్ట్రాల పోలీసుల సమన్వయం చేసుకుంటూ గాలింపు చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏటీఎంల చోరీలకు పాల్పడిన ఈ ముఠా.. నలుపురంగు స్కార్పియో వాహనాన్ని వాడుతూ పోలీసుల కళ్లుగప్పేందుకు అసలు రిజిస్ట్రేషన్ నంబరు ప్లేట్లకు బదులుగా ఇతర వాహనాల నంబర్ ప్లేట్లను మారుస్తూ తిరుగుతున్నట్టు గుర్తించారు.
ఈనెల 10న గాంధారి మండల కేంద్రానికి వచ్చిన దొంగల ముఠా వెల్డింగ్ షాప్ తాళాలు పగులగొట్టి సిలిండర్‌తోపాటు అవసరమైన సామగ్రిని దొంగిలించారు. ప్రధాన రోడ్డుపై ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు చేరుకున్నారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్కులు, క్యాప్‌లు, నైటీలు ధరించారు. ఏటీఎం సీసీ కెమెరాలు పనిచేయకుండా వాటిపై నలుపురంగు స్ప్రే వాడి గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేశారు. ఏటీఎంలో ఉన్న నోట్లకు సంబంధించిన ఐదు బాక్సులను వాహనంలో వేసుకొని పరారయ్యారు.


