గుట్ట పైనుంచి కింద పడ్డ ఆటో.. ఏడుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

గుట్ట పైనుంచి కింద పడ్డ ఆటో.. ఏడుగురికి గాయాలు

Oct 27 2026 12:50 AM | Updated on Oct 27 2026 12:50 AM

ఎల్లారెడ్డి: మండలంలోని తిమ్మాపూర్‌ గుట్టపై గల ఉమా సంఘమేశ్వర ఆలయంలో శివుడిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన భక్తుల ఆటో అదుపుతప్పి గుట్ట పైనుంచి కిందికి పడింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు కాగా.. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. కామారెడ్డికి చెందిన శ్రీరామ్‌ తన మిత్రుడైన ముక్తార్‌ కుటుంబసభ్యులతో కలిసి సో మవారం ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్‌ శివారు లోని ఉమా సంఘమేశ్వరాలయానికి ఆటోలో వెళ్లా రు. ఆలయంలో పూజలు నిర్వహించుకొని సాయంత్రం ఆటోలో కామారెడ్డికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమయంలో ఆటో అదుపుతప్పి గుట్ట పై నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆ టో డ్రైవర్‌ తాజుద్దిన్‌, ముక్తార్‌, ఆదిల్‌, అంజుమ్‌, శ్రీరామ్‌, అంకిత మరో చిన్నారికి గాయాలైనట్లు వా రు తెలిపారు. గాయపడిన వారిని స్థానికులు ఎల్లారె డ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఆటో డ్రైవర్‌ తాజుద్దిన్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో కామారెడ్డికి రిఫర్‌ చేసినట్లు వైద్యులు తెలిపారు. మిగితా వారికి స్వల్ప గాయాలైనట్లు వారు తెలిపారు.

ట్రాక్టర్‌ బోల్తా

బోధన్‌టౌన్‌(బోధన్‌): పట్టణ శివారులోని శ్రీనివాస్‌ క్యాంప్‌ వద్ద సోమవారం ఇసుక ట్రాక్టర్‌ టైర్‌ ఊడిపోయి అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయింది. మంజీరా నది నుంచి శ్రీనివాస్‌క్యాంప్‌ మీదుగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఇసుకను బోధన్‌ వై పునకు తీసుకు వస్తున్న ట్రాక్టర్‌ టైర్‌ అకస్మాత్తుగా వి డిపోవడంతో ట్రాక్టర్‌ అదపుతప్పి కిందపడి పో యింది.ఈప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement