ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఓ వైపు ప్రభుత్వం, ఉన్నతాధికారులు హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందనేందుకు ఈ చిత్రమే నిదర్శనం. బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ చౌరస్తా వద్ద ఆదివారం తాగునీటి సరఫరా పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడి నీరు వృథాగా పోయినా పట్టించుకునే వారు కనిపించలేదు. వారంలో రెండు రోజులు పైప్‌లైన్ లీకేజీ కారణంగా తాగునీరు వృథాగా పోతున్నా బల్దియా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పట్టణవాసులు విమర్శిస్తున్నారు.
– బోధన్ టౌన్
బోధన్‌లోని శక్కర్‌నగర్ చౌరస్తా వద్ద పైప్‌లైన్ లీకేజీతో వృథాగా పోతున్న నీరు


