రెడ్డిపేట శివారులో రోడ్డు పైనుంచి పైప్‌లైన్ వేసి
పంటకు అందిస్తున్న నీరు
జగదాంబ తండాలో ఎండిపోయి వరి పొలంలో పశువులను మేపుతున్న మహిళ రైతు
రామారెడ్డి(ఎల్లారెడ్డి): ప్రస్తుత సీజన్‌లో పలుచోట్ల ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు ఆశ తో అన్నదాతలు నీటి కోసం కష్టాలు పడుతుండ గా, మరోవైపు కొన్నిప్రాంతాల్లో సాగుచేసిన పంట ఎండిపోయి చేతికిరాకపోవడంతో రైతులు నిరాశ తో పశువులకు మేతగా వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు పైరెండు చిత్రాలు నిదర్శనంగా ని లుస్తున్నాయి. రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట శివారులో ఉన్న రెండు ఎకరాల వరిపంటకు రెండు, మూడు తడులిస్తే పంట చేతికోస్తుంది. ఒక వైపు బోరు ఉంటే, రోడ్డుకు అవతలి వైపు ఉన్న వరి పొలం నీరు లేక ఎండిపోయే స్థితికి చేరుకుంది. దీంతో సదరు రైతు సమీపంలోని బోరుబావి నుంచి పైప్‌లైన్ వేసి రోడ్డుపై వదిలాడు. దీంతో నీరు రోడ్డుగుండా ప్రవహిస్తూ పొలానికి చేరుతోంది. రోడ్డుపై పైప్‌లైన్ వేస్తే వాహనదారులకు ఇబ్బంది కలగడంతోపాటు పైప్‌లైన్ పగిలిపోయే ప్రమాదం ఉంది. ఈక్రమంలో అతడి ఆలోచనకు వాహనదారులు కూడా సహకరిస్తూ అండగా నిలవడం మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.
మరోవైపు మండలంలోని జగదాంబ జీపీ తండా పరిధిలో పంట పూర్తిగా దెబ్బతినడంతో, ఎండిన పంటను పశువులకు, గొర్రెలకు మేత గా వదలాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. రెండు ఎకరాల్లో సాగు చేసిన పంట కోసం ఎరువులు, విత్తనాలు కలుపు నిమిత్తం సుమారు రూ. 60వేలు వరకు పెట్టుబడి ఖర్చు అయిందని స్థానిక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని వాపోయారు. ప్రభు త్వం స్పందించి నష్టపోయిన తమను ఆదుకోవాలని, తగిన నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు.


