● లోటు వర్షపాతంలో బోరుబావులకు అందిన భూగర్భజలాలు
● చెరువులు నిండకున్నా
గట్టెక్కిన పంటలు
వేల్పూర్: ఎల్‌నినో వల్ల తగినంత వర్షాలు కురవక పోయినా వేల్పూర్ మండలంలో వాగులపై నిర్మించిన చెక్‌డ్యాంలు ఖరీఫ్ పంటలను గట్టెక్కించాయి. కరువు పరిస్థితుల వల్ల చెరువులు నిండకపోయినా చెక్‌డ్యాంలలో నిలిచిన నీరు బోరుబావులకు వెన్నుదన్నుగా నిలిచాయి. వీటికితోడు ఎస్సారెస్పీ వరదకాలువ ద్వారా వచ్చిన నీరు సైతం కూడా బోరుబావులకు ఎంతగానో ఉపకరించాయి. ఇతర ప్రాంతాలలో ఖరీఫ్‌లోనే నీరు లేక పంటలు ఎండిపోయినా, మండలంలో పంటలు ఎండిపోకుండా చెక్‌డ్యాంలు కాపాడాయి.
మండలంలో 12 చెక్‌డ్యాంలు..
వేల్పూర్ మండలంలో కొత్తపల్లి ఎన్, పచ్చలనడ్కు డ. జాన్కంపేట్, సాహేబ్‌పేట్, వేల్పూర్, వెంకటాపూర్, కుకునూర్, కోమన్‌పలి గ్రామాల మీదుగా పె ద్దవాగు, అక్లూర్, మోతె, రామన్నపేట్ గ్రామాల మీ దుగా కప్పలవాగు ప్రవహిస్తాయి. వీటిపై 12 చోట్ల చెక్‌డ్యాంలను ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి నిర్మింపజేశా రు. ఐదేళ్లుగా భారీ వర్షాలు కురుస్తూ చెక్‌డ్యాంలపై వరదనీరు పొంగి ప్రవహించింది. ఈ ఏడాది వర్షాకాలంలో ఏర్పడిన ఒకే ఒక్క వరదకు చెక్‌డ్యాముల్లో నీరు చేరింది. ఈ పరిస్థితుల్లో చెక్‌డ్యాంలలో నిలిచి న నీరు, వరదకాలువ నీరు బోరుబావులకు ఆధారంగా నిలిచాయి. వాగుల్లో చెక్‌డ్యాంలు రెండు వైపు లా సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు భూగర్భజలాలను అందించాయి. దీంతో తక్కువ నీటి నిల్వ లు ఉన్న బోరుబావులు కూడా ఎండిపోకుండా పంటలు గట్టెక్కాయి. మండలంలో 28652 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, సోయాబిన్, పసుపు, ఆయిల్‌ఫాం,కూరగాయలు, ఇతర పంటలు సాగయ్యాయి. ప్రస్తుత సీజన్‌లో పంటలు చేతికి రావడంతో చెక్‌డ్యాంలు ఆదుకున్నాయంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


