● ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు
నిర్వహించిన పూర్వవిద్యార్థులు
● ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో
భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు
ముప్కాల్ జెడ్పీహెచ్‌ఎస్ 2005–06 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు
పెద్దకొడప్‌గల్ జెడ్పీహెచ్‌ఎస్ 1999–2000 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు
సాక్షి నెట్‌వర్క్: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మ ధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యా ర్థులు భావోద్వేగానికి లోనయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్ర యివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థు లు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించా రు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏ ళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆ నందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. సాంస్కృతిక కా ర్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 1981–82 పదవతరగతి విద్యార్థులు రామేశ్వర్‌పల్లి రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో సామూహిక షష్టిపూర్తి మహోత్సవం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో 42 మంది స్నేహితులు తమ కుటుంబీకులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తామని, తమ స్నేహితులకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని తీర్మానించుకున్నారు.


