జీకే పోటీల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జీకే పోటీల్లో ప్రతిభ

Oct 26 2026 3:16 AM | Updated on Oct 26 2026 3:16 AM

జీకే పోటీల్లో ప్రతిభ ముగిసిన క్రికెట్‌ టోర్నీ రిటైర్డ్‌ కార్మికులకు ఈపీఎఫ్‌ చెల్లించాలి

వేల్పూర్‌(ముప్కాల్‌): ముప్కాల్‌ మండలం వేంపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని ఎట్టం తనుశ్రీ జనరల్‌ నాలెడ్జి(జీ.కే) పోటీలలో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొందినట్లు హెచ్‌ఎం శైవ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పీఎంశ్రీ ప్రైమరీ స్కూళ్ల విభాగంలో నిర్వహించిన పోటీలలో తనుశ్రీ ప్రతిభ చూపి, జిల్లా విద్యాధికారి సాయాగౌడ్‌ చేతుల మీదుగా బహుమతి అందుకున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా విద్యార్థినిని ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.

కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో గ్రీన్‌ ఫీల్డ్‌ క్రికెట్‌ క్లబ్‌(జీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన జీసీసీ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌–1 క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆదివారం ముగిసింది. రెండు వారాలుగా కొనసాగిన రెండు జిల్లాల క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఫైనల్‌ పోటీలు మెట్‌పల్లి ఇర్ఫాన్‌ దీపక్‌, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కమ్మర్‌పల్లి జట్ల మధ్య జరిగాయి. ఈ పోటీలో ఇర్ఫాన్‌ దీపక్‌ టీం విజేతగా నిలువగా, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కమ్మర్‌పల్లి జట్టు రన్నర్‌గా నిలిచింది. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ.40 వేల నగదు, రన్నర్‌ జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 30 వేల నగదును ఎస్‌ఐ సతీష్‌, సర్పంచ్‌ కొత్తపల్లి హారిక, రెంజెర్ల నర్సారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఉప సర్పంచ్‌ కొత్తపల్లి అశోక్‌, ఈర్నాల గంగాధర్‌, లుక్కా గంగాధర్‌, జోగ గంగాధర్‌, తెడ్డు రమేష్‌, బర్ల సురేష్‌ పాల్గొన్నారు.

బోధన్‌: రిటైర్మెంట్‌ అయిన కార్మికులకు ఈపీఎఫ్‌ (ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌) డబ్బులను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని సరస్వతీనగర్‌లో ఆదివారం ఆయన బీడీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు పని మానేసి వెంటనే ఈపీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా చేసుకుంటారన్నారు. కానీ కేంద్రం ప్రభుత్వం పీఎఫ్‌ చట్ట సవరణ వల్ల 12 నెలల తర్వాత ఈపీఎఫ్‌ నుంచి డబ్బులు తీసుకోవాల్సి వస్తుందని, ఇది కార్మికులకు నష్టకరమైన సవరణ అని అన్నారు. వెంటనే పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల పీఎఫ్‌ డబ్బులను బడా కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కార్మికులు గంగామణి, లక్ష్మి, నాగమణి, సుజాత, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement