వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు

Oct 26 2026 3:16 AM | Updated on Oct 26 2026 3:16 AM

బోధన్‌: ఎడపల్లి మండలంలోని ఎంఎస్సీ ఫారం సమీపంలో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. కోటగిరి మండల కేంద్రానికి చెందిన మోసిన్‌, అక్బర్‌ బైక్‌పై నిజామాబాద్‌ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో ఎడపల్లి మండలం ఎంఎస్సీ ఫారం సమీపంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన ప్రాంతంలోనే జైతాపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి రోడ్డు పక్కన నిలబడి ఉండగా గుర్తుతెలియని బైక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడి కాలు విరిగి గాయపడ్డాడు. బైకిస్టు దొరకుండా పరారైనట్టు తెలిసింది.

నస్రుల్లాబాద్‌: మండలంలోని నెమ్లి గ్రామంలోగల హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి కి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. పిట్లం మండలం కుర్తీ గ్రామానికి చెందిన మైసయ్య బైక్‌ పై ఆదివారం మైలారం గ్రామంలోని కొచ్చెర మై సమ్మ ఆలయం వద్ద నిర్వహించిన బంధువుల శు భకార్యానికి వెళ్లాడు. కొద్దిసేపటికి తిరిగి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. నెమ్లి గ్రామ శివారులోని 765డి జాతీయ రహదారిపై అతడి బైక్‌ అ దుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స మాచారం అందుకున్న ఎస్సై సాయికృష్ణ, పోలీ సులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement