రాష్ట్రస్థాయి రోలర్‌ స్కేటింగ్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి రోలర్‌ స్కేటింగ్‌ పోటీలకు ఎంపిక

Oct 26 2026 3:16 AM | Updated on Oct 26 2026 3:16 AM

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లాస్థాయి రోలర్‌ స్కేటింగ్‌ పోటీలు ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు రోలర్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ నిజామాబాద్‌ జిల్లా ప్రతినిధులు తెలిపారు. నగరంలోని సుభాష్‌నగర్‌ డీఎస్‌ఏ స్విమ్మింగ్‌ పూల్‌ ప్రాంగణంలో గల స్కేటింగ్‌ రింక్‌లో ఆది వారం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి రో లర్‌ స్కేటింగ్‌ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 150 మంది బాలబాలికలు పాల్గొనగా, 4–6, 6–8, 8–10, 10–12, 12–15, 15–18 సంవత్సరాల వయస్సు విభాగాల్లో నిర్వహించారు. వివిధ విభాగాల్లో ప్రతి భ కనబరిచిన క్రీడాకారులు బంగారు, రజత, కాంస్య పతకాలను సాధించారు. వీరంతా వచ్చే నెలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి రోలర్‌ స్కేటింగ్‌ పోటీ ల్లో పాల్గొంటారని జిల్లా ప్రధాన కార్యదర్శి రామచందర్‌ తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. డీవైఎస్‌వో పవన్‌ కుమార్‌, వినయ్‌ ధన్‌పాల్‌, శ్రీనివాస్‌, శ్రీరామ్‌ రాజేంద్రప్రసాద్‌, సీహెచ్‌ గంగాధర్‌, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement