ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌తో మానసిక ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌తో మానసిక ఆందోళన

Oct 19 2026 1:43 AM | Updated on Oct 19 2026 1:43 AM

ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌తో మానసిక ఆందోళన

నిజామాబాద్‌అర్బన్‌: ఇండియన్‌ సైకియాట్రి క్‌ సొసైటీ సౌత్‌ జోన్‌ వార్షిక సదస్సు ఆదివా రం తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగింది.సదస్సులో జిల్లా కు చెందిన ప్రభుత్వ వైద్యకళాశాల మానసిక విభా గం ప్రొఫెసర్‌ డాక్టర్‌ విశాల్‌ పాల్గొని ప్రసంగించా రు. ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ వ్యసనాలపై కలిగే నష్టాలను వివరించారు. ఈ సమస్యల వల్ల కొందరిలో డిప్రెషన్‌, ఆందోళన, నిద్రలేమి, ఆత్మహత్య ఆలోచనలు వంటి మానసిక సమస్యలు వస్తామన్నారు. అనంతరం డాక్టర్‌ విశాల్‌ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

భరోసా లేని భగీరథ నీళ్లు

బాన్సువాడ రూరల్‌: స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే భగీరథ పథకం లక్ష్యం నీరుగారుతోంది. మండలంలోని బోర్లంక్యాంపులో ట్యాంకు నుంచి గ్రామానికి సరఫరా అయ్యే నీటి పైప్‌లైన్‌ లీకేజీ అవుతోంది. తాత్కాలిక మరమ్మతులు చేయించినా లీకేజీ ఆగక తాగునీరు కలుషితమవుతున్నాయి. పంచాయతీ పాలకులు స్పందించి శాశ్వత పనులు చేయించాలని, శుభ్రమైన నీటిని సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

నిందితులపై చర్యలు తీసుకోవాలి

బోధన్‌: ఎడపల్లి మండలంలోని అంబం(వై) గ్రామానికి చెందిన పోలీస్‌ హోంగార్డు అల్లం భూమయ్య పట్టా భూమిలో కొందరు దౌర్జన్యంగా చొరబడి వరి పంటను కోశారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎడపల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేశాడు. గ్రామ శివారులో తనకు 15 గుంటల పట్టా భూమి ఉండగా అందులో వరి సాగు చేశానని పేర్కొన్నారు. భూమి విషయంలో గ్రామానికి చెందిన గద్రాసీ సావిత్రి, ఆమె కుమారుడు రాజుతో వివాదం ఉందని ఫిర్యాదులో తెలిపారు. గతంలో తనపొలంలో ప్రవేశించినందున వారి పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 16న మళ్లీ పొలంలో ప్రవేశించి పంటను కోశారని పేర్కొన్నారు. తాను నిజామాబాద్‌లో విధుల్లో ఉన్నందున ఫిర్యాదు చేసేందుకు ఆలస్యం జరిగిందన్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement