రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ

Oct 19 2026 1:43 AM | Updated on Oct 19 2026 1:43 AM

సిరికొండ: రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో సిరికొండ సత్యశోధక్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చారని ప్రిన్సిపాల్‌ ఆర్‌ నర్సయ్య తెలిపారు. హన్మకొండలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్‌–13 మినీ సబ్‌ జూనియర్‌ అంతర్‌ జిల్లా సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ 2026–27 బాలుర విభాగంలో జిల్లా జట్టు చాంపియన్‌గా నిలిచిందన్నారు. జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పాఠశాల విద్యార్థులు ఆర్‌ నరేంద్ర, జీ శరత్‌చంద్ర, కే సాయిసృజన్‌, టీ రిశ్విక్‌, బీ శ్రీరామ్‌ తమ క్రీడా ప్రతిభను చాటి జట్టు విజయంలో కీలక పాత్ర వహించి బంగారు పతకాలు సాధించారని తెలిపారు. విద్యార్థులను సాఫ్ట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు, తెలంగాణ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కాసర్ల నవీన్‌కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగామోహన్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement