నవీపేట: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం ఎంపిక చేసిన స్థలాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సుదర్శన్‌రెడ్డి శనివారం పరిశీలించారు. 3 ఎకరాల విస్తీర్ణంలో రూ. 9.73 కోట్ల వ్యయంతో అన్ని వసతులతో స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
యంచ ఫిల్టర్ బెడ్ పరిశీలన
యంచ సమీపంలోని మిషన్ భగీరథ న్యాల్‌కల్ పంప్ హౌజ్‌ను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. పంప్ హౌజ్ పరిధిలోని అన్ని గ్రామాలకు నీరు సరఫరా అవుతుందా? లేదా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి సమస్య ఎదురవుతుందని..దీనిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఇన్‌చార్జి డీఈవో సాయాగౌడ్, టీటీఈడబ్ల్యూడీసీ ఈఈ రవీందర్, స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు.


