మాచారెడ్డి: పాల్వంచ మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన శ్రా వ్య హాకీలో సత్తా చా టుతోంది. కేరళం రా ష్ట్రంలోని కొల్లంలోగల స్పోర్ట్స్ అథారిటీలో శిక్షణ పొందుతున్న ఆమె.. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యింది. ఈనెల 16న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో నిర్వహించిన హాకీ పోటీల్లో ప్రతిభ చూపడంతో మధ్యప్రదేశ్ జీవన్ యూనివర్సిటీ జట్టుకు ఎంపిక చేశారని గ్రామస్తులు తెలిపారు. నవంబర్ 2 నుంచి 5 వరకు రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించే వెస్ట్ జోన్ యూనివర్సిటీ నేషనల్ చాంపియన్షిప్లో శ్రావ్య పాల్గొననుందని పేర్కొన్నారు.


