నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మాజీ మేయర్ నీతూకిరణ్ పేర్కొన్నారు. శనివారం పాత కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న ఉద్యోగులకు మాజీ మేయర్‌తోపాటు తెలంగాణ రక్షణ సమితి అర్బన్ ఇన్‌చార్జి మోహిక రెడ్డి మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ప్రజారోగ్య సేవల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందజేశారు. కాగా, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు సమ్మెలో భాగంగా ధర్నా చౌక్‌లో డ్రెయినేజీలు శుభ్రపరచి పబ్లిక్ టాయిలెట్లు, బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఆర్మూర్ టౌన్: పట్టణంలోని జిరాయత్‌నగర్ శివాలయం పక్కన ఇత్తడి వస్తువుల తయారీ దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. దుకాణ యజమాని సయ్యద్ శుక్రవారం రాత్రి దుకాణానికి తాళం వేసి వెళ్లాడు. శనివారం తెల్లవారుజాము 3 గంటలకు హైదరాబాద్‌కు వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వచ్చారు. అదే సమయంలో ఓ వ్యక్తి దుకాణానికి వచ్చి కొన్ని వస్తువులు తయారు చేయించేందుకు ఫోన్‌లో సంప్రదించగా సయ్యద్ దుకాణానికి చేరుకున్నాడు. దుకాణం తాళం తీసి లోపలికి వెళ్లగా, వెనుక వైపు ఉన్న డోర్ తెరిచి ఉండటంతోపాటు సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయని బాధితుడు గుర్తించారు. 60 ఇత్తడి గంటలు, 30 కిలోల శ్రీ చక్రం, వెండి తోరణం తదితర వస్తువులు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో ఉన్న ఎంసీహెచ్, ఎన్‌ఆర్‌సీ కేంద్రాలతోపాటు 108 అంబులెన్స్‌లను డీఎంహెచ్‌వో రాజశ్రీ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో అత్యవసర మందులు, ఆక్సిజన్ సిలిండర్, స్ట్రక్చర్, రికార్డులను పరిశీలించారు. ఎంసీహెచ్ కేంద్రంలో మాతాశిశు ఆరోగ్య సేవలో రికార్డులు, అందిస్తున్న సేవలు, టీకాలు, ఎన్‌ఆర్‌సీలను తనిఖీ చేశారు. ఆమె వెంట గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ రేఖ, డాక్టర్లు నిరూప్ రెడ్డి, శ్రీలత, శిఖర, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


