పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు శిక్షణ

Oct 18 2026 1:12 AM | Updated on Oct 18 2026 1:12 AM

ఆర్‌టీఎఫ్‌ఎంఎస్‌తో మెరుగైన సేవలు

నిజామాబాద్‌ లీగల్‌: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ యస్‌. సాంబశివ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ ఎం. రజిని ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు శనివారం ఆర్గనైజింగ్‌ కేసులపై శిక్షణ నిర్వహించారు. కొత్తగా వచ్చిన బీఎన్‌ఎస్‌ చట్టం, భారత ప్రభుత్వ హోం వ్యవహారాల శాఖ జారీ చేసిన వ్యక్తుల అక్రమ రవాణా నిరోధక చట్టంపై చర్చించారు. మానవ అక్రమరవాణాను అరికట్టేందుకు సాంకేతికత ఎలా ఉపయోగించాలో వివరించారు. సమావేశంలో నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.

● ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌ రావు

సుభాష్‌నగర్‌: రియల్‌ టైమ్‌ ఫీడర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఆర్‌టీఎఫ్‌ఎంఎస్‌)ను విస్తృత స్థాయిలో అ మలు చేస్తూ నిజామాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని 139 సబ్‌స్టేషన్లకు స్కాడాతో అనుసంధానం పూర్తయ్యిందని, మరో 20 సబ్‌స్టేషన్లు పురోగతిలో ఉన్నాయని ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో విద్యుత్‌ సరఫరా నాణ్యతను మరింత మెరుగుపర్చి, అంతరాయాల తగ్గుదల, సమస్యలను వేగంగా గుర్తించి పరిష్కరించడం, ఫీడర్ల పనితీరును సమర్థవంతంగా పర్యవేక్షించడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సే వలు అందించవచ్చని పేర్కొన్నారు. ఆర్‌టీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా విద్యుత్‌ ఫీడర్ల పనితీరు రియల్‌టైమ్‌లో పర్యవేక్షించడంతోపాటు విద్యుత్‌ అంతరాయాలు, ఓవర్‌లోడ్‌, ఓల్టేజీ హెచ్చుతగ్గులు తదితర సమ స్యలు తక్షణమే గుర్తించి, సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement