నిజామాబాద్అర్బన్: కాపురానికి రావడం లేదని భార్యతోపాటు మామపై ఒకరు కత్తితో దాడి చేసిన ఘటన నగరంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నాలుగో టౌన్ ఎస్హెచ్వో సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా పోతుర గ్రామానికి చెందిన వైద్యనాథ్ మధుకర్ బావు అనే వ్యక్తి వినాయకనగర్ గోసంగల్లిలో ఉన్న తన మామ గౌతే మోహన్, భార్య పూజ ఇంటికి వచ్చాడు. తన భార్య పూజను కాపురానికి పంపడం లేదని కోపంతో వారిని నిద్రలేపి చేప లు కోసే కత్తితో మామ మెడ, తల, ఛాతిపై చేతుల పై దాడి చేశాడు. అడ్డుకున్న భార్యపై కూడా కత్తితో దాడి చేశాడు. అరుపులను విన్న స్థానికులు వైద్యనాథ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన మోహన్, పూజను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. శనివారం మధ్యాహ్నం వైద్యనాథ్ మధుకర్ బావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో సతీశ్ తెలిపారు.


