నిజామాబాద్ అర్బన్: మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా నూతన కమిటీ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సైదులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా జీ సాయిలు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మారుతి, కోశాధికారిగా సహదేవ్, అదనపు జనరల్ సెక్రెటరీగా నాగనాథ్ ఎన్నికయ్యారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ.. భారత సమాజంలో కుల, మత, లింగ వివక్షతలకు తావు లేదన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా లభించే ఫలాలను మాదిగ, మాదిగ ఉప కులాలు, విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని ఆ దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఉద్యమాలు చేస్తామన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని మాదిగ ఉద్యోగ సమాఖ్య నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడు సురేశ్, సభ్యులు నాంపల్లి జడ్డు గంగారాం, బాలచందర్, భూమన్న, గణేశ్, ప్రవీణ్, గంగాధర్, శ్రీనివాస్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.


