ఆహార ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ఆహార ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలి

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

రుద్రూర్‌: ఆహార ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలని పలువురు వక్తలు అన్నారు. మండలంలోని ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాలలో శుక్రవారం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించారు. ఆహార ఉత్పత్తులకు విలువ జోడింపు, పోషకాహారం ప్రాధాన్యం, ఆహార నాణ్యత మెరుగుదలలో నూతన ఆవిష్కరణలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ ఇంజినీరింగ్‌, సాంకేతిక విభాగం డీన్‌ డాక్టర్‌ కేవీ రమణారావు, కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ కే వెంకట్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఎం సంగీత, సుగంధ ద్రవ్యాల బోర్డు ఉపసంచాలకుడు టీ ప్రత్యూష్‌ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆహార పదార్థాల నాణ్యతను పెంచడం, పోషక విలువలను కాపాడటం, నూతన సాంకేతికతతో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. ఆహార రంగంలో ఆవిష్కరణలు, నాణ్యత ప్రమాణాలు ప్రజలకు మెరుగైన పోషకాహారం అందించడంలో కీలకమని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement