మంచిప్పలో కారు దహనం | - | Sakshi
Sakshi News home page

మంచిప్పలో కారు దహనం

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

మోపాల్‌: మండలంలోని మంచిప్ప గ్రామానికిచెందిన నంగునూరి సందీప్‌ కారును ఓ దుండగుడు నిప్పంటించడంతో దహనమైనట్లు ఎస్సై సుస్మిత శుక్రవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. సందీప్‌ రోజూలాగే తన ఇంటి ఎదుట గురువారం రాత్రి రోడ్డు పక్కన కారు పార్కింగ్‌ చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి ఆయన స్నేహితుడు విలాస్‌ కారు కాలిపోతున్న విషయాన్ని తెలపడంతో సందీప్‌ బయటకు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. అప్పటికే కారు ఇంజన్‌ భాగం, కుడివైపు టైరు, తదితర విభాగాలు దహనమయ్యాయి. మొదట ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఉంటాయని భావించినప్పటికీ.. ఇంట్లోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి రెండు ప్లాస్టిక్‌ బాటిళ్లలో పెట్రోల్‌ను కారు ఇంజన్‌ ముందు భాగంలో పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లిందని బాధితుడు పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement