పాత నేరస్తులపై నిఘా ఉంచాలి | - | Sakshi
Sakshi News home page

పాత నేరస్తులపై నిఘా ఉంచాలి

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

● ఏసీపీ ప్రకాశ్‌ యాదవ్‌

నిజామాబాద్‌అర్బన్‌: పాత నేరస్తులపై పోలీసు సిబ్బంది నిఘా ఉంచాలని ఏసీపీ ప్రకాశ్‌ యాదవ్‌ అన్నారు. నగరంలోని ఆరవటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఏసీపి శుక్రవారం తనిఖీ చేశారు. పీఎస్‌లోని రికార్డులను పరిశీలించారు. నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భద్రత వైఫల్యాలు లేకుండా ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. శాంతి భద్రతల ప్రాముఖ్యతను వివరించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌, హెల్మెట్‌ ధరించడం, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నా రు. సీఐ భిక్షపతి, ఎస్సై సందీప్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement