108 అంబులెన్సుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

108 అంబులెన్సుల తనిఖీ

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

108 అంబులెన్సుల తనిఖీ పీఆర్టీయూ రాష్ట్రకార్యవర్గంలో మండల ఉపాధ్యాయులు ఉద్యమకారుల కోసం వెబ్‌సైట్‌ ఏర్పాటు అభినందనీయం వైఐఐవోఈకి నాగిరెడ్డిపేట మోడల్‌ స్కూల్‌ ఎంపిక

మోపాల్‌: నగరశివారులో ని బోర్గాం(పి) ఆరోగ్య సబ్‌సెంటర్‌లోని 108 అంబులెన్స్‌ వాహనాలను ప్రోగ్రామింగ్‌ మేనేజర్‌ సంపత్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అంబులెన్స్‌ లోపల ఉన్న మందులు, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌తోపాటు రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న బాధితులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వాహనాల కండీషన్స్‌ ఎప్పటికప్పుడు గమనించాలని, ఏమైనా మరమ్మతులుంటే సత్వరమే చేయించుకోవాలన్నారు. అంబులెన్స్‌ల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.

కమ్మర్‌పల్లి: పీఆర్టీయూ ఆరవ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగింది. సమావేశం అనంతరం స్టేట్‌ అసోసియేట్‌ ప్రెసిడెంట్లను సభ్యులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో కమ్మర్‌పల్లి, ఏర్గట్ల మండల ఉపాధ్యాయులు ఎన్నికయ్యారు. ఎన్నికై న వారిలో ఎస్‌ శ్రీనివాసమూర్తి(హాసాకొత్తూర్‌), వీ నాగభూషణం(కమ్మర్‌పల్లి), జీ రాఽ దా కిషన్‌(బషీరాబాద్‌), టీ వర్ష(చౌట్‌పల్లి), జీ భాస్కర్‌ (తాళ్ల రాంపూర్‌), ఎం ప్రవీణ్‌(తొర్తి), దశేందర్‌(తొర్తి)దున్నారు. వీరికి పీఆర్టీయూ మండలాల అధ్యక్షులు పీ చంద్రశేఖర్‌, బీ కృష్ణ ప్రసాద్‌, సభ్యులు అభినందనలు తెలిపారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ ఉద్యమకారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుకు ప్రభుత్వం వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమకారుల జేఏసీ నాయకులు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్‌.భూపతిరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఏళ్లపాటు ఉద్యమకారులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేశారని పేర్కొన్నారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.

నాగిరెడ్డిపేట: యంగ్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌(వైఐఐవోఈ)కు నాగిరెడ్డిపేట మోడల్‌స్కూల్‌ ఎంపికై నట్లు స్కూల్‌ ప్రిన్సిపల్‌ రాంప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్‌స్కూల్‌లోని విద్యార్థులకు ఐఐటీ, జీఈఈ, ఎన్‌ఈఈటీ, క్లాట్‌ వంటి జాతీయస్థాయి పోటీపరీక్షలకు నాణ్యమైన విద్యతోపాటు క్రమబద్ధమైన శిక్షణను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో 29యంగ్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాలను ఎంపిక చేశారని ఆయన చెప్పారు. కోచింగ్‌ పొందే విద్యార్థుందరికీ ఉచితంగా స్టడీమెటీరియల్‌ అందిస్తారని వివరించారు.

24 బైకులు స్వాధీనం

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని ధర్మపురిహిల్స్‌లో శుక్రవారం రాత్రి ఆరవటౌన్‌ పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 24 బైకులు, 4 ఆటోలను సీజ్‌ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ ప్రకాశ్‌ యాదవ్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ భిక్షపతి, ఎస్సై సందీప్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement