ఫాంపాండ్స్‌ నిర్మాణంతో సత్ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

ఫాంపాండ్స్‌ నిర్మాణంతో సత్ఫలితాలు

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

నాలుగెకరాల్లో సాగు చేస్తున్న

● నీటి కొరతకు చెక్‌ పెట్టిన

14మంది రైతులు

● వాన నీటినే వరంగా మార్చుకున్న

అన్నదాతలు

మాచారెడ్డి: మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు నిర్మించుకున్న ఫాంపాండ్స్‌ సత్ఫలితాలనిస్తున్నాయి. ఉపాధి హామీ కింద ప్రభుత్వం ఒక్కొ ఫాంపాండ్‌ నిర్మాణానికి రూ. 1.70 లక్షలు వెచ్చిస్తుంది. వర్షం నీటిని ఒడిసిపట్టి, వేసవిలో సైతం పంటలకు ఉపయోగించడంతో రైతులకు అ వి వరంగా మారాయి. గతంలో వర్షం నీరు వృథా గా పోయేది. బోర్లు, బావుల్లో నీటి మట్టం పడిపోవ డంతో పంటలు ఎండిపోయేవి. ప్రభుత్వ ప్రోత్సాహం, ఉపాధి హామీ పథకం ద్వారా 14 మంది రై తులు తమ పొలాల్లో ఫాంపాండ్స్‌ నిర్మించుకున్నారు. ఫాంపాండ్స్‌ నిర్మించుకోవడానికి రైతులు ముందుకు వస్తున్నారు.

నీటి ఆదా పంటలకు భరోసా

వర్షాకాలంలో ఫాంపాండ్స్‌లో నిల్వ చేసిన నీటిని కరెంట్‌ లేని సమయం, ఎండాకాలంలో మోటార్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. దీంతో బోర్లపై ఆధారపడటం తగ్గింది. అదనంగా కూరగాయలు, పండ్ల తోటలు కూడా రైతులుసాగు చేస్తున్నారు. ఫాంపాండ్‌ నిర్మాణంతో పొలంలో నీళ్లు నిల్వ ఉండటంతోపాటు, భూగర్భ జలాలు కూడా పెరగుతున్నాయి. రైతులు ఎకరాకు 10 వేల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. మండలంలో మరింత మంది రైతులు ఫాంపాండ్స్‌ నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

ఫాంపాండ్‌ సహాయంతో రెండు ఎకరాల్లో మల్బరీ, మరో రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఫాంపాండ్‌ నీటిని నిల్వ చేయడంతో ఇప్పటివరకై తే ఇబ్బంది లేకుండా పారుతోంది. హర్షద్‌, రైతు, మాచారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement