● నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
సుభాష్‌నగర్: నగర పాలక సంస్థ పరిధిలోగల ఆ యా డివిజన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులు నా ణ్యతతో చేపట్టాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవా రం నగరంలోని 6, 23, 24, 48వ డివిజన్లలో రూ. 20 లక్షల చొప్పున నిధులతో చేపడుతున్న రోడ్డు ప నులకు నగర మేయర్ కూరగాయల ఉమారాణి, స్థానిక కార్పొరేటర్లతో ఆయన భూమిపూజ చేశారు. ఈసందర్భంగా ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు ప రిష్కరించడమే తన లక్ష్యమన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మూడేళ్లుగా సీడీ పీ నిధుల కోసం అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీ సుకెళ్లినా లాభం లేకుండా పోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో, రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడైనా నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు శక్తికి మించి పని చేస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ఎన్ని సార్లయినా కలుస్తానని స్పష్టంచేశారు. కార్పొరేటర్లు గోపిడి స్రవంతిరెడ్డి, విజయ మల్లేష్ యాదవ్, ఇప్పకాయల సుమిత్ర కిశోర్, ప్రసన్న, శ్యామల సత్యపాల్, తదితరులు పాల్గొన్నారు.


