ఆస్తి వివాదం.. ఒకరి ఆత్మహత్య
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): కుటుంబ ఆస్తి వివాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భీమ్‌గల్‌లో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బాపూజీనగర్‌కు చెందిన షేక్ రహీం(35) గత 15 ఏళ్ల నుంచి భార్య పిల్లలతో కలిసి భీమ్‌గల్‌లో నివాసం ఉంటున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో తన తల్లి, చెల్లెలు కలిసి ఉంటున్నారు. వారిద్దరు నివాసం ఉంటున్న ఇల్లు విషయమై వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈక్రమంలో ఆస్తి విషమయై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో షేక్ రహీం రెండు రోజుల క్రితం కోరుట్ల వెళ్లి గురువారం సాయంత్రం తిరిగి భీమ్‌గల్‌కు చేరుకున్నాడు. రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోయాక తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య షేక్ షహీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
భిక్కనూరు: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన భర్త చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మట్టి రాజు(39) సబిత దంపతులు. వీరికి 18 ఏళ్ల క్రితం వివాహం కాగా ఒక కుమారుడు ఉన్నాడు. గత నాలుగేళ్ల క్రితం కుటుంబ కలహాలతో భార్య సబిత కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లింది. నాటి నుంచి కాపురానికి రావాలని రాజు కోరినా ఆమె రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన అతను ఇంట్లో సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మద్నూర్: మండలంలోని లచ్చన్‌లో శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. ఫ్లెక్సీలో వార్డు సభ్యుల ఫొటోలను కింది వరుసలో ఉంచడంపై వార్డు సభ్యులు, గ్రామస్తులు కొందరు నిరసన వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీని చించివేశారు. ఈ విషయమై పలువురు ఎంపీడీవోకు ఫిర్యాదు చేస్తామన్నారు.


