క్రీడాకారులతో శిశుమందిర్ ఉపాధ్యాయులు
కామారెడ్డి టౌన్/కామారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్ హైస్కూల్ అండర్–14 బాలికల జట్టు ఇటీవల జరిగిన జాతీయస్థాయి ఖేల్‌కూద్ కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి చాంపియన్‌గా నిలిచి బంగారు పతకం సాధించింది. శుక్రవారం విజేతలు జిల్లా కేంద్రానికి చేరుకోగా, విజయోత్సవ ర్యాలీతో పాఠశాల యాజమాన్యం, క్రీడాభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రధానాచార్యులు నాగభూషణం, అకాడమిక్ ప్రిన్సిపాల్ నాగేష్ మాట్లాడుతూ.. బంగారు పతకం సాధించిన జిల్లా జట్టు వచ్చే నెలలో హరియాణాలో జరగనున్న ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయ పోటీల్లో విద్యాభారతి తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. ఎస్సై సాయికృష్ణ, సీనియర్ వైద్యులు శ్యాంసుందర్‌రావు, డీవైఎస్‌వో రంగావెంకటేశ్వర్ గౌడ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు బాణాల భాస్కర్ రెడ్డి, పేట అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


