వేల్పూర్: జాతీయస్థాయి అండర్–20 బాలుర కబడ్డీ శిక్షణకు జిల్లాకు చెందిన క్రీడాకారులు సురేశ్, అబ్రార్ ఎంపికై నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, ప్రధాన కార్యదర్శి గంగాధర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30 వరకు బాచుపల్లిలోని కాసాని కబడ్డీ అకాడమీలో నిర్వహించనున్న జాతీయస్థాయి శిక్షణ శిబిరంలో వీరు శిక్షణ పొందుతారని పేర్కొన్నారు. శిక్షణలో ప్రతిభ కనబరిచి, జాతీయస్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు జాతీయస్థాయి శిబిరానికి ఎంపిక కావడంపై అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు..
కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని మిసిమి హైస్కూల్‌కు చెందిన ఏ సుశాంత్ అండర్–13 రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల కరెస్పాండెంట్ రవీందర్, పీఈటీ సంజీవ్ తెలిపారు. ఇటీవల నిర్వహించిన జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో పాఠశాల తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లా జట్టుకి ఎంపికయ్యారు. హన్మకొండలో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ చాంపియన్ షి ప్‌లో జిల్లా జట్టు తరఫున వీరు పాల్గొంటున్నట్లు వి వరించారు. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసి న కార్యక్రమంలో సుశాంత్‌ను ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.


