క్రీడల అభివృద్ధిలో రిఫరీల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

క్రీడల అభివృద్ధిలో రిఫరీల పాత్ర కీలకం

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

పెర్కిట్‌(ఆర్మూర్‌): క్రీడల అభివృద్ధిలో రిఫరీల పాత్ర కీలకమని క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్‌ అల్జాపూర్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఆర్మూర్‌ మండలం చేపూర్‌లో నిర్వహించిన హ్యాండ్‌ బాల్‌ రిఫరీ క్లినిక్‌ ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి అల్జాపూర్‌ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రిఫరీలకు శిక్షణనివ్వడం ద్వారా క్రీడలను మరింత సమర్ధవంతంగా నిర్వహించవచ్చన్నారు. అనంతరం పరీక్షల్లో ప్రతిభ కనబరించిన రిఫరీలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్‌ కుమార్‌, అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ అల్జాపూర్‌ దేవేందర్‌, అధ్యక్షుడు గంగామోహన్‌ చక్రు, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌ రెడ్డి, కోశాధికారి గటడి రాజేష్‌, సునీత, శ్యామ్‌, నగేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement