ఆర్మూర్: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని పీడీఎస్‌యూ ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు డి.నిఖిల్ డిమాండ్ చేశారు. గురువారం ఆర్మూర్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. శాంతియుత పద్ధతిలో ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థి, యువతపై మోదీ ప్రభుత్వ తీరు దుర్మార్గమని అన్నారు. తొలగించిన ఓట్లను పునరుద్ధరించి, ఢిల్లీ నగర వీధులలో విధించిన ఆంక్షలు తొలగించి, రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దుర్గాప్రసాద్, రాజు, సిద్ధార్థ్ పాల్గొన్నారు.
పీడీఎస్‌యూ, పీవైఎల్ జిల్లా నాయకుల అరెస్ట్
బోధన్: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని, సర్ ప్రక్రియ రద్దు చేసి, అక్రమంగా తొలగించిన ఓట్లను మళ్లీ పునరుద్దరించాలని ప్రధాన డిమాండ్‌తో గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఎదుట పీడీఎస్‌యూ, పీవైఎల్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.ఈ ధర్నాలో పాల్గొన్న బోధన్‌కు చెందిన పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఆర్.గౌతం కుమార్‌తో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.


