పెర్కిట్(ఆర్మూర్): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్మూర్ ఎంఈవో రవీందర్ సూచించారు. ఆర్మూర్ మండలం కోమన్‌పల్లిలో గురువారం డ్రీమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంఈవో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. ఎక్కడైనా బాలలు పనుల్లో కనపడితే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. డ్రీమ్ స్వచ్ఛంద సంస్థ సీఈవో కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడమే సంస్థ లక్ష్యమన్నారు. ఆర్మూర్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సారంగి శాంతి కుమార్, సర్పంచ్ కావ్య ప్రవీణ్ గౌడ్, సంస్థ ప్రతినిధి రంజిత్ ప్రకాశ్, ఏవో హరికృష్ణ, శ్రీశైలం, నవీన్ రాజు పాల్గొన్నారు.


