స్వర్ణకార శంఖారావం సభ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

స్వర్ణకార శంఖారావం సభ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

బోధన్‌: తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం నేతృత్వంలో ఈ నెల 24న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో స్వర్ణకార శంఖారావం పేరుతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను గురువారం బోధన్‌ పట్టణంలో జిల్లా, పట్టణ ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ..స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వెంటనే పాలక మండలిని నియమించాలని కోరారు. 50 ఏళ్లు దాటిన స్వర్ణకార వృత్తిదారులకు నెలకు రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో బహిరంగ సభ తలపెట్టామని పేర్కొన్నారు. నాయకులు తొంగిల్లపల్లి శ్రీనివాస్‌, బందనకంటి నరసింహాచారి, మారోజు సుధాకర్‌ చారి, అశోక్‌చారి, బొప్పాపురం హనాండ్లు చారి, ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement