ఆర్‌టీసీ బస్సు పున:ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఆర్‌టీసీ బస్సు పున:ప్రారంభం

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

ఆర్‌టీసీ బస్సు పున:ప్రారంభం

నందిపేట్‌(ఆర్మూర్‌): తల్వేద గ్రామానికి నిజామాబాద్‌ డిపోకు చెందిన ఆర్‌టీసీ బస్సును గురువారం గ్రామ సర్పంచు గడిచంద హరిత ప్రారంభించారు. కొన్ని రోజులుగా తల్వేద గ్రామానికి ఆర్‌టీసీ బస్సు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో గ్రామ సర్పంచుతో పాటు గ్రామస్తులు జిల్లా కేంద్రంలో ప్రజావాణితో పాటు ఆర్‌టీసీ అధికారులకు తల్వేద గ్రామానికి బస్సును పున:ప్రారంభించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. స్పందించిన అఽధికారులు ఉదయం, సాయంత్రం రెండు టిప్రులతో బస్సును ప్రారంభించడానికి అంగీకరిచారు. ఉదయం 10:10 గంటలకు, సాయంత్రం 7:10 గంటలకు తల్వేద గ్రామంలో బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. ఉప సర్పంచు గడిచంద శ్రీకాంత్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement