బోధన్: ఎడపల్లి మండలంలోని జానకంపేట జెడ్పీహెచ్ఎస్లో గ్రోమోర్ గ్రామం కార్యక్రమంలో భాగంగా కోరమాండల్ ఇంటర్నేషనల్ సంస్థ విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఉచిత వాటర్ ప్యూరిఫయర్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. గురువారం పాఠశాల ప్రాంగణంలో కోరమాండల్ సంస్థ రాష్ట్ర సీనియర్ ఆఫీసర్ ఏవీపీ భాస్కర్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులతో కలిసి ప్లాంట్ను ప్రారంభించారు. పదో తరగతి వార్షిక ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించే విద్యార్థులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తామని సంస్థల డీలర్ తెలిపారు. కోరమాండల్ సంస్థ జోనల్ మేనేజర్ సజన కుమార్, సర్పంచ్ సుంచనకోట అనురాధ, ఉపసర్పంచ్ నీలం కృష్ణ, పాఠశాల హెచ్ఎం జోన్స్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


