పెర్కిట్(ఆర్మూర్): ఆలూర్ మండలం గగ్గుపల్లిలో చేపడుతున్న సోక్ పిట్, డ్రైనేజీ నిర్మాణ పనులను ఎంపీడీవో లక్ష్మా రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తాగు నీటి సమస్యలు తలెత్తకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతల నిర్మాణం, మురుగు నిల్వకుంగా ఉండడానికి డ్రైనేజీల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. సర్పంచ్ కొండి నడ్పి గంగాధర్, కార్యదర్శి కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్(బాల్కొండ):బాల్కొండ మండల కేంద్రంలో మార్కండేయ మందిరం పునర్నిర్మించేందుకు అయ్యే ఖర్చును దేవాదాయశాఖ ఏ ఈ రమేశ్ గురువారం అంచనా వేశారు. ఆలయంలోని విగ్రహాలు, పరిసరాలు పరిశీలించి, పునర్నిర్మాణ పనులకు అవసరమైన కొలతలు తీసుకున్నారు.కార్యక్రమంలో బాల్కొండ పద్మ శాలి సంఘం అధ్యక్షుడు అంద వెంకటగిరి, కోశాధికారి కుందారపు శ్రీనివాస్, కార్యదర్శి మేక నగేశ్, పెద్ద గంగాధర్, భోగ గంగాకిషన్, భోగ భూమేష్ పాల్గొన్నారు.
వేల్పూర్: పచ్చలనడ్కుడ గ్రామానికి చెందిన జాన జమున కుటుంబానికి రూ.2 లక్షల ఎల్‌వోసిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం వేల్పూర్‌లో అందజేశారు. జమున చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రిలో చేరడంతో విషయాన్ని నడ్కుడ బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
గల్ఫ్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
కమ్మర్‌పల్లి(మోర్తాడ్): గల్ఫ్‌లో అనారోగ్యం బారిన పడి మరణించిన మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన మోత్కు జీవన్ కుటుంబానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చేయూత అందించారు. గురువారం జీవన్ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వేర్వేరు చోట్ల పలు కుటుంబాలను పరామర్శించారు. బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఏలియా, సర్పంచ్ బోగ ఆనంద్, ఉప సర్పంచ్ సామ శ్రీనివాస్, నాయకులు పాపాయి పవన్, గోపిడి సత్యనారాయణ, జేసీ గంగారెడ్డి, అశోక్, మహిపాల్, రాజేంధర్, ఇంతియాజ్, కొలిప్యాక ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త నల్ల తిరుపతి తండ్రి నల్ల పెద్ద గంగారాం ఇటీవల మరణించడంతో కుటుంబ సభ్యులను ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం సాయంత్రం పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు.బాల్కొండ, కిసాన్‌నగర్ సర్పంచులు గాండ్ల రాజేశ్, రాంరాజ్‌గౌడ్, నాయకులు సాగర్‌యాదవ్, నర్సారెడ్డి తదితరులు ఉన్నారు.
కమ్మర్‌పల్లి: బషీరాబాద్, కోనసముందర్ గ్రామాల్లో కోరుట్ల పశు వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పశు వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. డాక్టర్లు శ్రీనివాస్, శిరీష, శ్రీకాంత్, శశాంక్‌లు శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు.
రుద్రూర్: మండల తహసీల్దార్‌గా సురేందర్ నాయక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మండల తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్‌కు గురికావడంతో ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న సురేందర్ నాయక్‌కు తహసీల్దార్ బాధ్యతలను అప్పగించారు.
బోధన్ టౌన్: బోధన్ పట్టణ రేషన్ డీలర్స్ ఆధ్వర్యంలో గురువారం అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని పలువురు అనాథ పిల్లలకు దుస్తులను బోధన్ ఆర్డీవో విజయ కుమారి చేతుల మీదుగా అందజేశారు. ఈ స్వచ్ఛంద కార్యక్రమం చేపట్టిన సోషల్ వర్కర్ సనా పటేల్ ను ఆర్డీవో అభినందించారు.


