పెర్కిట్(ఆర్మూర్): వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలకమని ఆర్మూర్ ఏడీఏ విజయలక్ష్మి అన్నారు. ఆర్మూర్ మండలం పిప్రిలో గురువారం మహిళా కిసాన్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ వ్యవసాయంలో విత్తనాలు నాటడడం మొదలుకుని, కలుపు తీయడం, పంటల సంరక్షణ, కోతల వరకు మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. మహిళా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులపై అవగాహన కల్పించి వారి ఆర్థిక స్వావలంభనకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా రైతులు శారద, గంగామణిలను సన్మానించారు. ఏవో హరికృష్ణ , సర్పంచ్ కిరణ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఏఈవోలు నిషికాంత్, రమ్య, గంగాజల, ఆత్మ బీటీఎం అనూష, ఏపీఎం భూమేష్ పాల్గొన్నారు.


