రీ సర్వే అనంతరం భూ ఆధార్‌ ఇస్తాం | - | Sakshi
Sakshi News home page

రీ సర్వే అనంతరం భూ ఆధార్‌ ఇస్తాం

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

● సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ

డి శ్రీనివాసులు

మోపాల్‌: గ్రామాల్లో సర్వే చేసిన తర్వాత ప్రతి భూమికి భూ ఆధార్‌ ఇస్తామని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ డి శ్రీనివాసులు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి రీ సర్వే అవగాహన సదస్సును బుధవారం మండలంలోని కులాస్‌పూర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రీ సర్వేకు సంబంధించి విధి విధానాలను శ్రీనివాసులు వివరించారు. ఈనెల 15వ తేదీ నుంచి గ్రా మంలో రీ సర్వే చేపట్టనున్నామన్నారు. రీ సర్వేలో భాగంగా ముందుగా గ్రామ సరిహద్దును నిర్ధారిస్తామని, ఆ తర్వాత గ్రామకంఠం సర్వే చేస్తామని తెలిపారు. ఆ తరువాత ప్రభుత్వ భూముల సర్వే, గ్రామ రహదారులు, చెరువులు, పట్టా భూముల సర్వే నిర్వహిస్తామన్నారు. ప్రతి సర్వే నంబర్‌ను సర్వే చేసి ఆ భూమికి భూ ఆధార్‌ ఇస్తామని, అలాగే అన్ని భూములకు ఎల్‌పీఎం నంబర్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. అధునాతన టెక్నాలజీ రోవర్లను వినియోగించి రీ సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలందరూ రీ సర్వేకు సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. నిజామాబాద్‌ ఆర్డీవో రాజేందర్‌కుమార్‌, సర్పంచ్‌ జనార్దన్‌రెడ్డి, ఉపస ర్పంచ్‌ మహిపాల్‌, డీఐలు శశి సత్య, డి శేఖర్‌వర్మ, దత్తు, తహసీల్దార్‌ ఎన్‌ రేఖ, ఆర్‌ఐ రాజేశ్వర్‌రావు, సర్వేయర్‌ బాలకృష్ణ, హరి, ప్రతాప్‌కుమా ర్‌, జీపీవోలు రజిత, రజిని, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు అభిలా ష్‌, అజయ్‌, వీడీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement