వరద కాలువకు నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

వరద కాలువకు నీటి విడుదల

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

● కాకతీయ కాలువ ద్వారా

5 వేల క్యూసెక్కులు..

వేల్పూర్‌(మెండోరా): కాకతీయ కాలువ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ 83 నుంచి 94 వరకు సుమారు లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు శ్రీ రాంసాగర్‌ ప్రాజెక్టు వరదకాలువ ద్వారా 4500 క్యూసెక్కుల నీటిని అధికారులు బుధవారం విడు దల చేశారు. వరదకాలువ కిలోమీటరు 88 వద్ద ఉన్న లింక్‌ కాలువ ద్వారా కాకతీయ కాలువకు నీటిని మళ్లించేందుకు నీటిని విడుదల చేశారు. వరద కాలువ నీటి మళ్లింపు పథకం ద్వారా చొప్ప దండి, కరీంనగర్‌, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాలకు సాగునీరందించేందుకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. నీటి మళ్లింపుతో ఆయకట్టు రైతులకు సాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. మరోవైపు కాకతీయ కాలువ ద్వారా శనివారం ప్రారంభమైన 5 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ, వరదకాలువ, సరస్వతి, లక్ష్మీ కాలువలతోపాటు గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ పథకానికి నీటిని విడుదల చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement