కామారెడ్డి రూరల్: పట్టణ శివారులోని రామారెడ్డి బైపాస్ బ్రిడ్జి వద్ద బుధవారం అదుపుతప్పి మొరం లారీ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న మొరం లారీ రామారెడ్డి బైపాస్ వద్ద బోల్తా పడడంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. ఘటనలో గాయపడ్డ లారీ డ్రైవర్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి పోలీసులు తెలిపారు.
బొగ్గుగుడిసె శివారులో ఆటో..
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని బొగ్గుగుడిసె శివారులో ఆటో బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఎల్లారెడ్డి నుంచి మహ్మద్‌నగర్ వైపు వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన మహ్మద్‌నగర్ మండలం గున్కుల్ గ్రామానికి చెందిన ప్రశాంత్, రజాక్‌లను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.


