నిజామాబాద్‌అర్బన్: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు మంగళవారం విధులను బహిష్కరించి జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ కార్యాలయం ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్యలను పరిష్కరించేంతవరకు నిరసన కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం నాయకుడు షాదుల్లా, కాంట్రాక్టు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి రీ సర్వే పరిశీలన
జక్రాన్‌పల్లి: మండలంలోని మాదాపూర్‌లో కొనసాగుతున్న భూ భారతి రీ సర్వేను ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా పరిశీలించారు. గ్రామంలో వ్యవసాయ పట్టా భూములలో కొనసాగుతున్న సర్వేను పరిశీలించారు. అనంతరం భూభారతి రీ సర్వేపై సమీక్షించారు. భూభారతి రీ సర్వే ను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ కిరణ్మయి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, సర్పంచ్ అరుణ్ కుమార్, ఆర్‌ఐ ప్రవీణ్, సర్వేయర్ నాగేశ్, సిబ్బంది పాల్గొన్నారు.


