● ఇండియాకు రప్పించాలని వినతి
డిచ్‌పల్లి: గల్ఫ్ దేశమైన మస్కట్ లో పలువురు తెలంగాణ వాసులు చిక్కుకున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన బోశెట్టి రాంచందర్ సోషల్ మీడి యా ద్వారా తమ గోడు వెల్ల బోసుకున్నాడు. ఏడాది క్రితం నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన సుమారు 20 మంది వరకు ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున చెల్లించి జగిత్యాలకు చెందిన బీఎంఆర్ మ్యాన్‌పవర్ కంపెనీ ద్వారా మస్కట్ కు బతుకుదెరువు కోసం వెళ్లారు. ఆ సమయంలో ఏజెంట్ వారికి బల్దియా (మున్సిపల్)లో పని చేయాల్సి ఉంటుందని చెప్పి లేబర్ సప్లయి కంపెనీలో చేర్చారు. అక్కడ ముందుగా రెండు నెలల జీతం కట్ చేసుకున్న కంపెనీ తర్వాత నాలుగు నెలల జీతం ఇచ్చి తర్వాత నిలిపివేశారు. ఆరు నెలలుగా కార్మికులతో పని చేయించుకుంటున్నా కంపెనీ యజమానులు జీతాలు ఇవ్వ డం లేదు. ఏజెంట్‌కు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడం లేదు. జీతాలు లేక తిండి తనడానికి ఇ బ్బందులు పడుతున్నారు. ఇండియాకు వెళ్లిపోతాం.. పాస్‌పో ర్టు ఇవ్వండని కంపెనీ వారిని అడిగితే రూ.1.50 లక్షలు కడితేనే పాసుపోర్టు ఇస్తామని చెబుతున్నారు. పని చేయకుండా రూంలో ఉంటే కంపెనీ ప్రతినిధులు వచ్చి కొడుతున్నారని.. మా గోడును సోషల్ మీడియా ద్వారా పంపించినా ఎవరూ ప ట్టించుకోవడం లేదని రాంచందర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మస్కట్‌లో చిక్కుకున్న తెలంగాణవారిని ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని వీడియోలో కోరారు.


