పారదర్శకంగా చేయూత పింఛన్ల సర్వే | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా చేయూత పింఛన్ల సర్వే

Oct 14 2026 12:29 AM | Updated on Oct 14 2026 12:29 AM

రెంజల్‌: జిల్లాలో చేయూత పింఛన్ల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు డీపీవో శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్లు వస్తాయని వివరించారు. మంగళవారం మండలంలోని కూనేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో పలువురి దరఖాస్తులు తిరస్కరణకు గురవడంతో క్షేత్రస్థాయిలో విచారించేందుకు వచ్చారు. కూనేపల్లిలో ఐదు, బాగేపల్లిలో మూడు తిరస్కరణకు గురైనట్లు వివరించారు. వారిని పంచాయతీ కార్యాలయాల వద్దకు పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎందుకు తిరస్కరణకు గురైందనే విషయాలను దరఖాస్తుదారులకు వివరించారు. వాటికి సంబంధించిన ధ్రువపత్రాలతో అధికారులకు అందిస్తే తిరిగి విచారణ చేపట్టి అర్హుల జాబితాలో చేర్చడం జరుగుతుందన్నారు. కూనేపల్లిలో డీపీవోను సర్పంచ్‌, ఉపసర్పంచులు సన్మానించారు. బోధన్‌ బీఎల్‌పీవో నాగరాజు, కూనేపల్లి సర్పంచ్‌ మల్లేశ్‌, ఆయా గ్రామాల ఉప సర్పంచులు శ్రీనివాస్‌గౌడ్‌, జ్యోతిలక్ష్మణ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement