నిజామాబాద్అర్బన్: ఐఎంఏ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్–2026 నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ పోటీలను ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ జీవన్రావు మంగళవారం ప్రారంభించారు. మాదకద్రవ్యాలకు నో చెప్పండి.. క్రీడలకు అవును చెప్పండి.. జీవితాన్ని ప్రేమించండి అనే నినాదంతో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విశాల్ మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని అన్నారు. డాక్టర్ విశాల్ 100, 200 మీటర్ల పరుగుల పోటీల్లో పాల్గొని తోటి వైద్యులకు స్ఫూర్తిగా నిలిచారు. అనంతరం నిర్వహించిన పో టీల్లో పలువురు వైద్యులు విజేతలుగా నిలిచారు. కా ర్యక్రమంలో ఐఎంఏ జనరల్ సెక్రెటరీ డాక్టర్ హరీశ్ స్వామి, డాక్టర్ రాజేశ్వర్, వైద్యులు పాల్గొన్నారు.


