భవానీ సేవలో యువతరం | - | Sakshi
Sakshi News home page

భవానీ సేవలో యువతరం

Oct 14 2026 12:29 AM | Updated on Oct 14 2026 12:29 AM

డొంకేశ్వర్‌: సమాజంలో సరికొత్త ఆధ్యాత్మిక విప్లవం ఆవిష్కృతమవుతోంది. నిన్న, మొన్నటి వరకు వయోవృద్ధులకే పరిమితమనుకున్న దైవ చింతన వైపు నేడు యువతరం పరుగులు తీస్తోంది. ఆడంబరాలకు, పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితుల య్యే నేటి యువత, కఠినమైన నియమాలతో కూ డిన ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం విశేషం. ముఖ్యంగా దుర్గామాత సేవలో యువత అగ్రభాగంలో నిలుస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతోంది. ఆది పరాశక్తిగా భావించే దుర్గామాతకు ఏటా భక్తులు పెరుగుతున్నారు. యువత ఎక్కువ సంఖ్యలో మాలను ధరించడం వారిలో భక్తిభావాన్ని పెంచుతోంది. మూడు రోజుల క్రితం దేవీశరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఊరూరా దుర్గామాతను ప్రతిష్ఠించగా, యువకులు పెద్ద ఎత్తున మాలలు ధరించడం విశేషం. చిన్న పిల్లలు, మహిళలు సైతం దుర్గమ్మ సేవపై ఆసక్తితో మా లలు, కండువాలు ధరించారు. దుర్గామాత మా ల అంటే అత్యంత పవిత్రమైనది. దీనిని ధరిస్తే కఠి న నియమాలు పాటించాలి. హరిశడ్వర్గాలు(కామం, క్రోదం, మోహం, లోబం, మదం, మశ్చ్యరం) అదుపులో పెట్టుకోవాలి. నియమనిష్టలతో ఉపవాస పూజలు చేయడం వలన ఇది సాధ్యమవుతుందని పండితులు, పది పర్యాయాలు మాల ధరించి న పెద్దలు చెబుతున్నారు. పిల్లలు చిన్నప్పుడే మాల ధరించడం వలన వారిలో భక్తి భావం పెరగడమే కాకుండా క్రమ శిక్షణను అలవర్చుకోవడానికి అవకాశముంది. యువత చెడు అలవాట్లను దూరం చేసుకుని సన్మార్గంలో నడవడం, పనిపై ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దుర్గాదేవిని మ నసు పెట్టి కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకం కలుగడంతో మాలను ధరించే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ ఏడాది ప్రతీ ఊరిలో కనీసం 50 మందికి తగ్గకుండా మాలలు ధరించారు.

దుర్గామాతకు ఏటా

పెరుగుతున్న భక్తులు

మాలధారణతో

క్రమశిక్షణ, భక్తి భావం

పిల్లలు, మహిళల్లో సైతం

దుర్గమ్మ సేవపై ఆసక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement