ఖలీల్‌వాడి: జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు కొనసాగినట్లు ఇన్‌చార్జి డీఈవో సాయాగౌడ్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఎస్సెస్సీ ఇంగ్లిష్ పరీక్షకు 126 మందికి 101 మంది హాజరు కాగా 25 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షకు 163 మందికి 133 మంది హాజరు కాగా 30 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.
ఖలీల్‌వాడి: కేజీబీవీ జిల్లా కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మికి జిల్లా విద్యాశాఖ అధికారులు షోకాజ్ నో టీస్ జారీ చేసినట్లు తెలిసింది. కేజీబీవీ పరిధి లోని జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన బిల్లులు చేయనందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చినట్లు సమాచారం. బిల్లులు పూర్తి చేయనందుకు నెలవారి జీతం ఆపాలని షోకాజ్ నోటీస్‌లో ఆదేశించినట్లు తెలిసింది.
పెర్కిట్: ఆర్మూర్ మండలం పిప్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి అండర్–18 ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం పీ నవీన్ మంగళవారం నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా స్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన ఏ వైష్ణవి, ఎస్ అస్మిత అద్భుత ప్రతిభతో రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. హైదరబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని అన్నారు. విద్యార్థులను హెచ్‌ఎం నవీన్, సర్పంచ్ కిరణ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ అభినందించారు.
సెల్ ఫోన్ దొంగకు దేహశుద్ధి
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో సెల్ ఫోన్ లాక్కుని పారిపోతున్న దొంగను ప్రయాణికులు, స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట డిపోకు చెందిన బస్సులో ఓ మహిళ ప్రయాణిస్తోంది. బస్సు పాత బస్టాండ్ వద్దకు చేరిన సమయంలో ఆ మహిళ చేతిలో ఉన్న సెల్ ఫోన్ను ఓ దుండగుడు ఒక్కసారిగా లాక్కుని పారిపోయేందుకు యత్నించాడు. దీనిని గమనించిన తోటి ప్రయాణికులు, స్థానికులు కేకలు వేస్తూ దొంగను వెంబడించారు. కాస్త దూరంలోనే అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అటవీ భూమి ఆక్రమణకు పాల్పడిన వ్యక్తి అరెస్టు
లింగంపేట: బొల్లారం అటవీ సెక్షన్ పరిధిలోని ఎక్కపల్లి అటవీ ప్రాంతంలో చెట్లను నరికి భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన ఎల్లయ్యను మంగళవారం అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి రేంజ్ అధికారి రమేశ్, బొల్లారం సెక్షన్ అధికారి అశ్వప్ తెలిపారు. నిందితుడిని ఎల్లారెడ్డి కోర్టులో హాజరుపర్చగా విచారణ చేపట్టిన జడ్జి కండిషనల్ బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఫారెస్టు రేంజ్ అధికారి రమేశ్ మాట్లాడుతూ.. అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అడవులలో చెట్ల నరికివేత, అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


