ప్రతిభ చాటి.. పతకాలు గెలిచి | - | Sakshi
Sakshi News home page

ప్రతిభ చాటి.. పతకాలు గెలిచి

Oct 14 2026 12:29 AM | Updated on Oct 14 2026 12:29 AM

● మొదటి స్థానంలో నిలిచిన

నిజామాబాద్‌ జట్టు

● ముగిసిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 70వ రాష్ట్ర స్థాయి యోగాసన క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ నెల 11 నుంచి 13 వరకు జిల్లా కేంద్రంలోని టీటీఆర్‌సీ భవనంలో యోగా పోటీలు నిర్వహించారు. అండర్‌–14, 17 విభాగాల్లో ఓవరాల్‌ చాంపియన్‌గా నిజామాబాద్‌ జిల్లా క్రీడాకారులు నిలిచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఇన్‌చార్జ్‌ డీఈవో రమేశ్‌, డీపీవో రవీందర్‌ విజేతలకు బహుమతులను అందించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో అవసరమని వారు అన్నారు. ఓవరాల్‌ చాంపియన్‌ అండన్‌–17 విభాగంలో నిజామాబాద్‌(ప్రథమ), ఆదిలాబాద్‌(ద్వితీయ), మెదక్‌(తృతీయ), అండర్‌–14 విభాగంలో నిజామాబాద్‌(ప్రథమ), మెదక్‌ (ద్వితీయ), రంగారెడ్డి(తృతీయ స్థానం) జట్లు విజేతలుగా నిలిచాయి. అనంతరం విజేతల కు ముఖ్య అతిథులు మెరిట్‌ సర్టిఫికెట్లు, పతకాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర పరిశీలకులు సత్యనారాయణ, జిల్లా సెక్కరెటరీ భాస్కర్‌రెడ్డి, విద్యాశాఖ ఏడీ శాస్త్రి, సెక్టోరియల్‌ అధికారి రామస్వామి, జిల్లా యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌, సతీశ్‌, యోగా శిక్షకులు, పీఈటీలు, పీఈడీలు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement