పనుల్లో పురోగతి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

పనుల్లో పురోగతి సాధించాలి

Oct 14 2026 12:29 AM | Updated on Oct 14 2026 12:29 AM

● అర్బన్‌ ఎమ్మెల్యే

ధన్‌పాల్‌ సూర్యనారాయణ

సుభాష్‌నగర్‌: నియోజకవర్గానికి సంబంధించి ఆర్‌ అండ్‌ బీ పనుల్లో పురోగతి సాధించాలని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఆర్‌ అండ్‌ బీ అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇందూరులో చారిత్రక కట్టడమైన ఖిల్లా రామాలయ అభివృద్ధికి పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వాలు రోప్‌ వే కోసం డీపీఆర్‌ సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిపారు. ఇటీవల ఆర్‌ అండ్‌ బీ అధికారులతోపాటు రోప్‌ వే నిర్మాణ కంపెనీ ప్రతినిధులు పరిశీలించారని గుర్తుచేశారు. ప్రధానంగా నగరంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పాత పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

అంతకుముందు పబ్లిక్‌ హెల్త్‌ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఇందూరులో కొనసాగుతున్న యూజీడీ, టీయూఎఫ్‌ఐడీసీ రూ.60 కోట్ల పనుల పురోగతిపై చర్చించారు. సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ డీఈలు నాందేవ్‌, రామ్మోహన్‌, ఏఈ సాయి కుమార్‌, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ యోగేశ్‌, ఏఈ శివకృష్ణ, యూజీడీ వర్క్స్‌ మేనేజర్‌ జయశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement